Thursday, 6 December 2012

 తెలంగాణ అంశంపై కేంద్రంలో ఏదైనా కదలిక వస్తే.. తెలంగాణ ప్రాంత ప్రజలేమోగానీ.. ప్రత్యేక రాష్ట్రవ్యతిరేకులు మాత్రం చురుగ్గా కదులుతారు! సీమాంధ్ర పార్టీలు, సీమాంధ్ర నేతల వ్యవహారాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి! మొన్నటిదాకా అఖిలపక్షం కోసం నానాయాగీ చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు అఖిలపక్షంలో తాము కొత్తగా చెప్పేది ఏమీ లేదంటూ దాట వేస్తున్నారు. కాంగ్రెస్ వైఖరి చెప్పిన తర్వాతే తమ అభివూపాయం చెబుతామంటూ మెలిక పెట్టారు. అటు కాంగ్రెస్‌లోనూ సీమాంధ్ర ప్రాంత నేతలు తెరపైకి వచ్చారు. అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ, సీమాంధ్ర తరఫున ఇద్దరు ప్రతినిధులను పంపాలని లేదంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నుంచి ఒకొక్కరిని పంపాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టిందన్న విమర్శలున్నాయి. అభివూపాయ సేకరణ పేరుతో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను పంపడంతో వారు తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా స్పందించారు. తెలంగాణను ఏర్పాటు చేయాలని ఒకరు డిమాండ్ చేస్తే.. మరొకరు సమైక్యవాదం వినిపించారు.

No comments:

Post a Comment