Sunday, 16 December 2012
’ప్రజాప్రతినిధులంతా ఏకమైతే తెలంగాణ వస్తది’
’ప్రజాప్రతినిధులంతా ఏకమైతే తెలంగాణ వస్తది’
నల్లగొండ: తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఏకమైతే తెలంగాణ రాష్ట్రం తప్పకుండా వస్తుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ జరిగిన ‘తెలంగాణ విద్యావంతుల వేదిక మూడో మహాసభ’కు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సంపద, వనరులను సీమాంధ్రులు దోచుకుంటున్నరని ఆయన ఆవేదనతో అన్నారు. తెలంగాణ వస్తే ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. సీమాంధ్ర ఆధిపత్యానికి తలొగ్గే తెలంగాణ నేతలు ఉద్యమంలో కలిసిరావడంలేదని ఆవేదనతో అన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు కొట్లాడితే తెలంగాణ ఇస్తరు
ప్రజాప్రతినిధులు ఏకమైతే తెలంగాణ సాధ్యమని కోదండరాం అన్నారు. ఎంపీలు కొట్లాడితే అఖిల పక్షాన్ని వేశారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి కొట్లాడితే తెలంగాణను తప్పకుండా ఇస్తరని ఆయన తెలిపారు. రాజకీయ అస్థిత్వం సాధించినపుడే మనం తెలంగాణను సాధించుకోగలమని వెల్లడించారు.
న్యాయవాదులపై కేసులు అప్రజాస్వామికం
తెలంగాణ ఉద్యమం చేస్తున్న న్యాయవాదులపై కేసులు బనాయించడం అప్రజాస్వామికమని కోదండరాం విమర్శించారు. తెలంగాణ న్యాయవాదులను ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని లేకుంటే జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment