Friday, 7 December 2012

భైంసాలో బాబు పాదయాత్రలో ఉద్రిక్తత

భైంసాలో బాబు పాదయాత్రలో ఉద్రిక్తత ఆదిలాబాద్ చంద్రబాబు పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలో రెండో రోజు పాదయాత్రలో భాగంగా ఆయన ఇవాళ భైంసాలో పర్యటిస్తున్నారు. అయితే, తెలంగాణపై బాబు స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ జైతెలంగాణ నినాదాలు చేస్తూ, తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలు బాబు పర్యటనను అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కూడా తెలంగాణ వాదులనే టార్గెట్ చేసి లాఠీచార్జీ జరిపారు. కాగా, తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నామని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ప్రకటన చేశారు.

No comments:

Post a Comment