మీనాన్నతో ప్రెస్‌మీట్ పెట్టించి జై తెలంగాణ అనిపించు
- లోకేష్‌కు టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ సవాల్
- మాటల గారడీని పక్కన పెట్టాలని హితవు
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ది మాటల గారడీయేనని, విషయ పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు ఆయన కూడా ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారానే జవాబు చెప్పారు. చిన్న మోసగాడిగా ఎదుగుతున్న పెద్ద మోసగాడిలాగా కనిపిస్తున్నారని లోకేష్‌పై మండిపడ్డారు.
టీడీపీ తెలంగాణ ఇవ్వాలని చెబితే అటెండర్‌గా పని చేసేందుకు సిద్ధమని చెప్పానని, అయితే టీడీపీ అఖిలపక్షంలో ఇచ్చిన సీల్డ్ కవర్‌లో తెలంగాణ పదమే లేదని అన్నారు. తెలంగాణపై టీడీపీ కనీస స్పష్టతనివ్వలేదని పేర్కొన్నారు. తండ్రి చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు లోకేష్ వారసుడిగా ఆ బాటలో పయనిస్తున్నారన్నారు. మీ తండ్రి బాబుతో ప్రెస్‌మీట్ పెట్టించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పించాలని ఆయన లోకేష్‌కు ట్విట్టర్‌లో హరీశ్‌రావు సవాల్ చేశారు. లోకేష్‌ది హిపోక్షికసి వైఖరి అని ఆయన అన్నారు. మోసపూరిత వైఖరిలో తండ్రి బాబును లోకేష్ మించిపోతున్నారని విమర్శించారు. మాటల గారడీని పక్కన పెట్టాలని ఆయన సూచించారు. వాస్తవంలో జీవించాలని హితవు పలికారు.

No comments:
Post a Comment