‘టీ న్యూస్’కు యునిసెఫ్ అత్యుత్తమ పురస్కారం
లింగ వివక్షకు వ్యతిరేకంగా బాలికల సంరక్షణ ఆవశ్యకతను మానవీయ కోణంలో కళ్లకు కడుతూ ‘బంగారం’ పేరుతో రూపొందించిన ప్రత్యేక కథనానికి గాను ‘టీ న్యూస్’ చానల్‌కు యునిసెఫ్ అత్యుత్తమ పురస్కారం దక్కింది. దీన్ని చానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నారాయణడ్డి, కథనం డైరెక్టర్ సంతోష్‌కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అందజేశారు. బాలికల సంరక్షణ, వివక్షల నివారణ అన్న అంశాలపై అత్యుత్తమ కథనాలు ప్రసారం చేసిన పలు టీవీ చానెళ్లకు సోమవారం బంజారాహిల్స్ తాజ్‌డెక్కన్ హోటల్లో యునిసెఫ్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో నానాటికి బాలికల పట్ల వివక్ష కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, నవజాత శిశువుల సంరక్షణతో పాటు బాలికల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా విరివిగా ప్రచారం చేసి సమాజాన్ని చైతన్య పర్చాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. రాష్ట్రంలో బాలకార్మిక నిర్మూలన చట్టం అమలైన నాటి నుంచి బాలికలకు ఆదరణ పెరిగిందని చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు స్త్రీలకు అత్యున్నత ప్రాముఖ్యతను ఇచ్చాయని గవర్నర్ గుర్తుచేశారు. బాలికల ఆరోగ్యం కోసం పాఠశాల స్థాయిలో పలు సంస్కరణలు చేసి అభివృద్ధి పరచాలన్నారు. లింగ వివక్షకు గురికాకుండా బాలికలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘టీ న్యూస్’ ముఖ్య కార్యనిర్వహణాధికారి నారాయణడ్డికి ఆయన పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. హెచ్ఎం టీవీ, వనిత, సప్తగిరి, జెమినీ, ఈటీవీ తదితర చానళ్లకు కూడా పురస్కారాలు లభించాయి. అదేవిధంగా బాలగాయని మధుప్రియకు కూడా గవర్నర్ జ్ఞాపికను అందజేశారు. కార్యక్షికమంలో ఐఏఎస్ రిటైర్డ్ అధికారి మోహన్ కందా, జూరీ సంస్థ చైర్పర్సన్ పీఎన్ వాసంతి, సోనీ కుట్టి జర్జి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment