తెలంగాణ లాయర్లపై కేసులు
-24 మందిపై విచారణకు ఆదేశం
-న్యాయశాఖ ఉత్తర్వులు జారీ
-ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తే కేసులా?
-మండిపడుతున్న తెలంగాణవాదులు
హైదరాబాద్, డిసెంబర్ 15 (టీ మీడియా):తెలంగాణ కోసం ఉద్యమించిన టీ న్యాయవాదులపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. విచారణ బాధ్యతలను హైదరాబాద్ సీసీఎస్‌కు అప్పగించింది. దీనిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేయడానికి సీబీఐకి అనుమతి ఇవ్వని ప్రభుత్వం దశాబ్దాల ఆకాంక్ష అయిన తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న న్యాయవాదులపై విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని వ్యాఖ్యానిస్తున్నారు. హైకోర్టు ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను ఐపీసీ 147, 506, 323, 186, 228, 153 కింద 24 మంది తెలంగాణ న్యాయవాదులను విచారించాలంటూ రాష్ట్ర డీజీపీకి, నగర పోలీస్ కమిషనర్‌కు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ దామోదర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ 24 మంది న్యాయవాదుల తప్పించుకున్నారని, అచూకీ లేదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే ఇందులో కొంత మంది న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వ తరపు రంగ సంస్థల తరపున స్టాండింగ్ కౌన్సిల్‌గా, ఏజీపీలుగా రోజువారీ కోర్టు విధుల్లో హాజరవుతుండటం గమనార్హం.
విచారణ ఎదుర్కొనబోతున్న న్యాయవాదులు:
మర్రిడ్డి భాగ్యమ్మ, మంజుల వకీల్, వెంకట్ యాదవ్, ఆకుల భిక్షపతి, గోలి విప్లవ్డ్డి, జలకం సంపత్‌కుమార్, గోపిడ్డి చంద్రశేఖర్‌డ్డి, పాశం కృష్ణాడ్డి, ఆర్ రాఘమ్మ, బుచ్చిడ్డి, నాగుల శ్రీనివాస్ యాదవ్, జీ రాజవర్ధన్డ్డి, సంపూర్ణ దేవి, గంపా వెంక మాణిక్ ప్రభు, మాణిక్ రెడ్డి, పీ అశోక్, సంతోష్ సింగ్, శశాంక్ గోయల్, చంద్రయ్య యాదవ్, ఠాకూర్ రూపా సింగ్, శ్రీనివాస గౌడ్, బీ రవీంవూదనాథ్, జీ చెన్నా వీరయ్య.
కేసుల నేపథ్యం: హైకోర్టు ఉద్యోగాలు, ప్రభుత్వ న్యాయవాదులు, అడ్వకేట్ జనరల్ నియామకంలో తెలంగాణకు ఫెయిర్ షేర్ అమలు చేయకపోవడంపై తెలంగాణ న్యాయవాదులు 2010లో హైకోర్టులో పెద్దఎత్తున ఆందోళన చేశారు. కోర్టు ప్రాంగణంలో బైఠాయించారు. ప్రశాంతంగా చేపడుతున్న ఆందోళనను చెదరగొట్టాలనే ఉద్దేశంతో పోలీసులు, సీమాంవూధకు చెందిన కొందరు న్యాయవాదులు కుట్రలు చేశారు. హైకోర్టు ఆస్తి ధ్వంసం చేశారని, ఇతర ప్రాంతాలకు చెందిన న్యాయవాదులపై దాడులు చేశారని హైకోర్టు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రిజిష్ట్రార్ సూచనల మేరకు పోలీసులు కొంత మంది న్యాయవాదులు దాడులకు పాల్పడ్డారంటూ కేసులు నమోదు చేశారు. కేసు విచారణ సమయంలో హైకోర్టు రిజిష్ట్రార్ 24 మంది టీ న్యాయవాదులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ఆస్తులను ధ్వంసం చేసినట్లు కేసులు నమోదు చేశారు. దీనిపై ప్రతివాదులైన తెలంగాణ న్యాయవాదులకు నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులకు తెలంగాణ న్యాయవాదులు వివరణ ఇచ్చారు. ఇంతలో ఇదే విషయంపై సుప్రీంకోర్టులో సీమాంవూధకు చెందిన న్యాయవాది పీవీ కృష్ణయ్య కేసు దాఖలు చేశారు.
తెలంగాణ ఉద్యమకారులు తనపై దాడి చేశారని, కోర్టు విధులకు ఆటంకం కల్గిస్తున్నప్పటికీ ప్రభుత్వం, హైకోర్టు వర్గాలు ఆందోళనకారులపై చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం, దాడులకు పాల్పడిన వారిపై చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
వెల్లు నిరసనలు
తెలంగాణ న్యాయవాదులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు వెల్లు ‘‘కోట్లాది రూపాయల కుంభకోణాలు, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మంత్రులపై సీబీఐ వంటి సంస్థలు కేసులు నమోదు చేసినా విచారణకు మినహాయించిన ప్రభుత్వం, తెలంగాణ న్యాయవాదులపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం వివక్ష వైఖరికి నిదర్శనం’’ అని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ శ్రీరంగారావు విమర్శించారు. కోర్టుల్లో 55 ఏళ్లుగా తెలంగాణకు ఫెయిర్ షేర్ కింద రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వడంలో విముఖత చూపిన ప్రభుత్వం, తమకు రావాల్సిన ఉద్యోగాల కోసం పోరాడిన తెలంగాణ న్యాయవాదులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేయడం శోచనీయమని న్యాయవాది చెలికాని వెంకట్ యాదవ్ అన్నారు. ఇలాంటి బెదరింపులకు తెలంగాణ ప్రజలు, న్యాయవాదులు భయపడరని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment