గైర్హాజరు కథ.. గప్‌చుప్!
- అనుకున్నదే అయింది
- సుజనాచౌదరి రాజీనామాను
తిరస్కరించిన చంద్రబాబు!
- పార్టీలో పూర్తి వ్యతిరేకత వచ్చినా
వెనుకేసుకొచ్చిన అధినేత
- ఎఫ్‌డీఐలను
ఆహ్వానిస్తున్న హెరిటేజ్!
- వాల్‌మార్ట్‌పై అందుకే అంత ప్రేమ
- అంతా బాబు కనుసన్నల్లోనే..?
హైదరాబాద్, డిసెంబర్ 18 (టీ మీడియా):అంతా ఊహించినట్లే జరిగింది. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో ఓటింగ్‌కు గైర్హాజరైన ఎంపీలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెనుకేసుకొచ్చారు. ఇదేమంత పెద్ద విషయం కాదంటూ లైట్‌గా తీసుకున్నారు. సొంతపార్టీ నేతల నుంచి విమర్శలొచ్చిన నేపథ్యంలో సుజనాచౌదరి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామాను పంపించిన సంగతి తెలిసిందే. ఆ రాజీనామాను బాబు తిరస్కరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో తీవ్ర దుమారానికి, వాద ప్రతివాదాలకు దారితీసిన ఉదంతం విచివూతరీతిలో సద్దుమణుగుతున్న తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది. వాల్‌మార్ట్ లాబీయింగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు పడిపోయారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాబు కనుసన్నలలోనే ఇదంతా జరిగి ఉంటుందనే అభివూపాయాలూ వినిపిస్తున్నాయి. ఆయనకు తెలియకుండా పార్టీలో ఏదీ జరగదని ఒక నేత అన్నారు. ఒకవైపు ఎఫ్‌డీఐలపై ఓటింగ్ జరుగుతుండగానే చంద్రబాబు కుటుంబసంస్థ అయిన హెరి ఫుడ్స్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలను తీసుకురావడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు హెరి ఫుడ్స్ రిటైల్ పేరుతో ఒక సంస్థను రిజిస్టర్ చేశారు. రిటైల్ వ్యాపారాన్ని వేరుచేసి దేశీయ లేదా విదేశీ భాగస్వామ్యాన్ని ఆహ్వానించే ప్రతిపాదనకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసినట్లు కంపెనీ ప్రెసిడెంట్ సాంబశివరావు తెలిపినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి.
దీంతో చంద్రబాబు నేరుగా తన కుటుంబ కంపెనీలలోకే ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో ఎంపీలు కావాలనే ఓటింగ్‌కు గైర్హాజరయ్యారని, ఇదంతా బాబు ఆదేశాలతోనే జరిగిందని అంటున్నారు. వాల్‌మార్ట్ లాబీయింగ్‌లో టీడీపీ నేతలు కూడా భాగస్వాములయ్యే అవకాశం ఉందన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోజు సుజనాచౌదరితోపాటు దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి ఓటింగ్‌లో పాల్గొనలేదు. వాస్తవానికి ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌కు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఎంపీలు కూడా హాజరయ్యారు. నేదురుమల్లి జనార్దనడ్డిని వీల్ చైర్లో తీసుకొచ్చారు. అలాగే మహారాష్ట్రకు చెందిన ఎంపీ జనార్దన్ వాఘ్మారేను స్ట్రెచర్ మీద తీసుకొచ్చి ఓటు వేయించారు. ఎక్కడో విదేశాలలో ఉన్న విజయ్‌మాల్యాను కూడా పిలిపించి ఓటేయించారు. అందుకు విరుద్ధంగా టీడీపీ ఎంపీలు ఢిల్లీలోనే ఉండి అప్పటివరకు సభలో పాల్గొని ఓటింగ్ సమయంలో వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది. పైగా ఓటింగ్‌లో పాల్గొనకపోవడానికి వాళ్లు చెపుతున్న కారణాలు కూడా సహేతుకంగా లేవని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఆ ఉదంతంపై పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌డ్డి ఘాటుగా స్పందించారు. పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తలసాని శ్రీనివాసయాద్ కూడా ఇదే స్థాయిలో స్పందించారు. ఎంపీల తీరును పయ్యావుల కేశవ్ తప్పుబట్టారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బయటకు ఈ ముగ్గురు నాయకులే తీవ్రంగా స్పందించినా, చాలామంది నేతలు కూడా ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా ఆ ఎంపీలు అనుసరించిన తీరుపై గుర్రుగా ఉన్నారు. ఓటింగ్‌కు గైర్హాజరైన ఎంపీలలో ఒకరు బాబుకు చెప్పే పాల్గొనలేదని ప్రకటించడం గమనార్హం. టీడీపీకి రాజ్యసభలో ఐదుగురు ఎంపీలున్నారు. ఓటింగ్‌లో వీరి పాత్రా కీలకమైనదే. ఎఫ్‌డీఐలపై వ్యతిరేక తీర్మానాన్ని రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ తరపున సీఎం రమేశ్ బలపరిచారు. ఆరోజు మరో ఎంపీ హరికృష్ణ కూడా సభలోనే ఉన్నారు. మిగిలిన ఎంపీలు- సుజనాచౌదరి, గుండు సుధారాణి, దేవేందర్‌గౌడ్‌లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. గుండు సుధారాణి ఏదో కారణంతో ఒకరోజు ముందే ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రాగా, అప్పటివరకు సభలోనే ఉన్న సుజనాచౌదరి, దేవేందర్‌గౌడ్ వివిధ కారణాలతో సభ నుంచి వెళ్లిపోయారు. దీని మతలబు ఏమిటనేది అందరికీ ఆసక్తి కలిగించింది. పార్టీ నేతలు వారి వైఖరిని తీవ్రంగా తప్పుబట్టి రాజీనామాలకు డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా సుజనాచౌదరి, దేవేందర్‌గౌడ్ కూడా మండిపడ్డారు.
ఈ పదవి ఓ పదవా అని దేవేందర్‌గౌడ్ వ్యాఖ్యానిస్తే, తన స్థాయి తెలియక ఏవేవో మొరుగుతున్నారంటూ సుజనాచౌదరి రెచ్చిపోయారు. కొద్దికాలం వాదవూపతివాదాలు కొనసాగినా, అటు తర్వాత ఊహించనిరీతిలో వాతావరణంలో మార్పు కనిపించింది. గైర్హాజరైనవారి వివరణలకే బాబు మొగ్గుచూపడంతో విమర్శించిన నాయకులు కూడా చల్లబడ్డారు. సర్దుబాటుకొచ్చారు. అప్పుడే తెర తతంగమేదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో సుజనాచౌదరి రాజీనామా కూడా ప్రహసనంగా మిగిలిపోతుందనే అంచనాలు వెలువడ్డాయి. అంతా అనుకున్నట్లుగానే అయిందని ఇప్పుడు టీడీపీ నేతలు అభివూపాయపడుతున్నారు. ముగ్గురు ఎంపీలు గైర్హాజరు కావడంతో రాజ్యసభలో యూపీఏ సర్కారు గట్టెక్కింది. దీంతో పరోక్షంగా కాంగ్రెస్‌కు, ఎఫ్‌డీఐలకు సహకరించినట్లయిందని పార్టీ నేతలు అంటున్నారు. ఎఫ్‌డీఐల వ్యవహారంలో అంతా వాల్‌మార్ట్ మాయనేనని అభివూపాయపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సుజనాచౌదరికి అన్ని దేశాల్లో వ్యాపార సంబంధాలున్నాయి. కేంద్రంలో కీలకశాఖ నిర్వహిస్తున్న మంత్రి కుమారుడితో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం ఉంది. ఆయా సంబంధాల ద్వారానే బాబుతో జరిగిన రాయబారాలు, వాల్‌మార్ట్ డీలింగ్లతో ఎఫ్‌డీఐలపై బాబు ఎంపీలను గైర్హాజరు చేయించారన్న ప్రచారం జరుగుతోంది. అంతా తన కనుసన్నలలోనే జరగడంతో బాబు ఈ వ్యవహారాన్ని లైట్‌గా తీసుకున్నారని పార్టీ నాయకుడొకరు అన్నారు. చిన్న చిన్న కారణాలనే నెపంతో సుజనాచౌదరి రాజీనామాను తిరస్కరించాలని చంద్రబాబు నిర్ణయించారని పార్టీ నేతలు అంటున్నారు.

No comments:
Post a Comment