Tuesday, 11 December 2012

మరోసారి ధగ పడనున్న తెలంగాణ!


 తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఈ నెల 28నే జరుగుతుంది.. ఈ సమావేశానికి ఒక్కో పార్టీ తరఫున ఎంతమందిని పంపాలనేది ఆయా పార్టీల ఇష్టం..! రాజకీయ పార్టీలతో జరుగనున్న ఈ సమావేశమే చిట్ట చివరిది కాదు..! తెలంగాణపై అంతిమ పరిష్కారం వచ్చేవరకు సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది..! ఇదీ తుట్టతుదకు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తేల్చిన విషయం! అఖిలపక్ష సమావేశాలు, హామీలు, ప్యాకేజీల చాటుమాటు మాటలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నాన్చేందుకే ప్రయత్నిస్తున్నదని తెలంగాణవాదులు మండిపడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి మరోసారి అటువంటి ప్రకటనే చేశారు. పార్లమెంటులో ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో పాల్గొనేలా తెలంగాణ ఎంపీలను బుజ్జగించి, వారు ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం వేసిన పాచిక పారిందని దీంతో స్పష్టమైంది.

అసలు తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నది కేంద్రం తలపెట్టింది కాదని, రాష్ట్రానికి చెందిన ‘తొమ్మిది, పది మంది’ ఎంపీలు కోరితేనే ఆ సమావేశాన్ని ఏర్పాటుచేశామని కూడా షిండే కొత్త విషయం చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటును బహిష్కరించి, ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో పాల్గొనేది లేదని పార్టీ అధిష్ఠానానికి హెచ్చరిక చేసిన నేపథ్యంలోనే డిసెంబర్ 28న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసిందన్న భ్రమను షిండే తన ప్రకటనతో పటాపంచలు చేశారు. దేశంలోని శాంతిభవూదతల పరిస్థితిపై ఢిల్లీలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేంద్ర హోం మంత్రి మాట్లాడారు. అఖిలపక్ష సమావేశం హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ నెల 28న యథాతథంగా జరుగుతుందని చెప్పారు.
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీఆర్‌ఎస్,బీజేపీ, సీపీఐ, సీపీఎం ఇప్పటికే తమ అభివూపాయాన్ని స్పష్టంగా చెప్పాయి. కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, వైఎస్సార్సీపీ ఇప్పటికీ తమ వైఖరిని ప్రజలకు స్పష్టం చేయలేదు. తెలంగాణపై 2010 జనవరి 5న మొదటిసారి, 2011 జనవరి 6న రెండోసారి అఖిలపక్ష సమావేశాలు జరిగాయి.

No comments:

Post a Comment