Tuesday, 18 December 2012

వైసీపీ గూండాల్లారా ఖబడ్దార్: విజయశాంతి


వైసీపీ గూండాల్లారా ఖబడ్దార్: విజయశాంతి
వరంగల్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయంపై వైఎస్సార్సీపీ గుండాలు దాడి చేయడాన్ని ఎంపీ విజయశాంతి తీవ్రంగా ఖండించారు. మీ సీమాంధ్ర గూండాగిరి తెలంగాణలో నడవదని ఆమె దుయ్యబట్టారు. ‘వైఎస్సార్సీపీ గుండాల్లారా ఖబర్దార్. మాతో పెట్టుకుంటే తెలంగాణలో పాదయాత్రలు చేయనీయం. తెలంగాణ ద్రోహులను అడుగడుగున అడ్డుకుంటం’ అని ఆమె అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. మీ పాదయాత్రల సంగతి తెలంగాణ ప్రజలే చూసుకుంటారని ఆమె అన్నారు. ప్రజలే మీకు బుద్ది చెబుతారని హెచ్చరించారు.

No comments:

Post a Comment