Friday, 28 December 2012

భారీగా తెలంగాణవాదుల ముందస్తు అరెస్ట్‌లు


భారీగా తెలంగాణవాదుల ముందస్తు అరెస్ట్‌లు
 చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ‘వస్తున్న మీకోసం’ పాదయాత్ర సందర్భంగా వెల్లంపల్లిలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల ముందు నుంచి కొనసాగుతున్న అరెస్టులు ఈ రోజు పరాకాష్టకు చేరుకున్నాయి. యువకులను, విద్యార్థులను, జేఏసీ నాయకులను, టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. వెల్లంపల్లి పరిసర ప్రాంత గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల సహాకారంతో ఇంటింటికి తెలంగాణవాదులకోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 3000 మంది కానిస్టేబుళ్లు, వేల మంది హోంగార్డులను బాబు పర్యటన బందోబస్తుకు ప్రభుత్వం నియమించింది. 10 తరగతి పిల్లలను సైతం వదలకుండా పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టు చేయడంపై తెలంగాణవాదులు, పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment