కాకతీయ వైభవం- వ్యాస పరంపర పేరిణి తాండవం
ఈ పేరిణి ఒక విశిష్ట కళారూపం. తెలుగువీరులు రుద్రప్రేరణగా ప్రదర్శించి, లోకానికి అందించిన వీరనాట్యం. ఇలాంటి వీరనాట్యం ప్రపంచంలో వేరేచోట లేదని నేను గట్టిగా చెప్పగలను. దీనిని ఎలాగైనా పునః సృష్టించాలన్న సంకల్పం నాకు కలిగింది. ఈ సంకల్పం వల్లే ఓర్పుతో శ్రమించాను. నా శ్రమకు ఫలితం దక్కింది. మళ్లా మరొకసారి నృత్య సంప్రదాయాలను పరిశీలించాను. కాలగర్భంలో కలిసిపోయిన, సుమారు వేయి సంవత్సరాలు మరుగున పడివున్న ఈ శివ తాండవాన్ని పునఃసృష్టించాను.ప్రారంభం: అదొక శివాలయం. దాని గర్భగుడిలో మూల విరాట్టు పరమశివుడు లింగ రూపంలో ఉన్నాడు. అందులో వారగా అఖండ నేతి దీపం సన్నగా వెలుగుతూంది. అయిదు రేఖల తెల్లగన్నేరు, పచ్చగన్నేరు మందారాలు, నాగమప్లూల, బిల్వపవూతాలతో అలంకృతమైన ఆ నల్లని లింగమూర్తి ఆ వెలుగులో వింతకాంతులతో శోభిల్లుతున్నాడు. ఆలయంలో ఆ మూర్తికి ఎదురుగా బలిపీ దానిచుట్టూ, శిల్పి తన శిల్పకళా చాతుర్యంతో అలంకరించిన నృత్యభంగిమలు నిండుగా గల నాలుగు స్తంభాలున్నాయి.
ఆ బలిపీ ఒక నర్తకుడు నిలబడి ఉన్నాడు. ఆ నర్తకుడు పసుపు వన్నె వస్త్రాలను ధరించాడు. మెడలోను, చేతులకు రుద్రాక్షమాలలు ఉన్నాయి. నొసట విభూతి రేఖలు దిద్దుకొన్నాడు. నడుముకు పసుపు వన్నె దట్టి ఉంది. అతని వెనుక వాయిద్య మేళం వారు ఉన్నారు. ఆ పరమశివునికి పూజారి హారతి ఇచ్చాడు. సాంబ్రాణి ధూపం వేశాడు. ఆ సువాసనలు ఆలయమంతా వ్యాపించాయి.
ఆ మహదేవునికి ఎదురుగా నర్తకుడు ఆ బలిపీ సమస్థానకంలో నిలబడ్డాడు. ఆ లింగమూర్తి పైనే తన దృష్టిని ఏకాక్షిగతతో నిలిపాడు. మద్దెల, మహామద్దెల, ఉడుక్కు, నందిమద్దెల వాయించేవారు సిద్ధంగా ఉన్నారు. పెద్ద కంచుతాళాలను చేత బుచ్చుకొని నట్టువాచార్యుడు సన్నగా వాయిస్తూ మేళవూపాప్తి జరిపించాడు. ఈ మేళవూపాప్తి మార్దవంగా కొద్ది నిమిషాలపాటు జరిగిన తర్వాత ఆ వాయిద్యగోష్టి నాదం గాంభీర్యాన్ని సంతరించుకొంది. నర్తకుడు వీటికి చలించకుండా ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. అతని నేత్రాలలో ఒక వింత కాంతి గోచరిస్తున్నది. ఇంతలో అతని శరీరం సన్నగా చలించింది. బాకాపైవి ఆ వాయిద్యకుడు రాగాలాపన చేశాడు. ‘భాం’ అంటూ శంఖం ఘోషించింది.
‘హరహర మహాదేవ! ఓం రుద్రాయ! శ్రీ మహేశ!’’ అంటూ వాయిద్య గోష్టివారు శివుణ్ణి స్తోత్రం చేయడం మొదలుపెట్టారు.
మెరుపు తీగలాగ మెరిసిపోతూ ఆ నర్తకుడు నర్తన మాడడం ప్రారంభించాడు. అతని శరీరంలోని ప్రతి రక్త అణువులోను రుద్రశక్తి ప్రవేశించి ప్రకాశవంతమై, ప్రతిధ్వనిస్తూ భక్తులకు ఒక దివ్వానుభూతిని కలిగించింది. అతనిలో ప్రేరణ కలిగింది.
ఆ ఆలయంలోని శివుడు లింగరూపంలో ఉన్నాడు కాని, శివునికి ఒక రూపమంటూ లేదు. ఆయన్ను ఏ రూపంలో ఊహించుకొని ధ్యానిస్తామో ఆయన ఆ రూపంలోనే మనకు ప్రత్యక్షమై మనల్ని అనుక్షిగహిస్తాడు. ఈ లింగమూర్తి జ్యోతి రూపం దాల్చి, ఆ గర్భగుడిలో నుండి వెలికి వచ్చి, మనం ఊహించుకొన్న, మనం ప్రసన్నుడు కావాలని ఆకాంక్షించుకొన్న రూపం ధరించి దర్శనమిస్తాడు.
శివుడు ప్రసన్నమూర్తి, ప్రశాంతమూర్తి, పార్వతీపతి, నటమహానట నటరాజమూర్తి, ప్రణయమూర్తి, యోగమూర్తి, ధ్యానమూర్తి, రుద్రమూర్తి ఇలా మనం ఆయన్ను ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలోనే ఆయన ప్రత్యక్షమౌతాడు. మన ధారణాశక్తిని అనుసరించి మనకు ఫలితం దక్కుతుంది. ఇది మనందరి విశ్వాసం.
తన్నారకం, తత్కారం, తహనాలు, యతులు, గతులు, జతులు, జాతులను వరుసగా మార్ధాంగికులు మృదంగంపై పలికిస్తూంటే ఆ నర్తకుడు తన దృష్టిని ఆ లింగమూర్తిపై లగ్నం చేసికొని, ఆరాధనా భావంతో నర్తనమాడుతున్నాడు. మంచి ముత్యాల్లాగ స్వేద బిందువులు అతని శరీరం పైనుండి నేల రాలుతున్నాయి. అతడు అలా ఆడి, ఆడి ఆ దివ్యమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు. తన జ్ఞాననేవూతాన్ని తెరిచి ఆ జ్ఞానమూర్తిని సందర్శించాడు. ఆ వెంటనే అతని శరీరం ఒక వింత కాంతితో వెలిగింది. అతని నేత్రాలు జ్యోతుల్లా ప్రకాశించాయి. ఆ ఆలయ మందంతటా ఒక దివ్యకాంతి ప్రసరించింది. ఆ నర్తకుడు మరింత కాంతివంతుడై పవివూతుడైనాడు.
ప్రేరణ ముగిసింది. శివాచార్యులు అతని శరీరాన్ని మెత్తని గుడ్డతో వత్తి, అతని శిరస్సుపైని శివుని కిరీటాన్ని పెట్టి అలంకరించాడు. అప్పుడతడు పరమ శివునిలా ప్రకాశించాడు.
ఆ తర్వాత ఆ నర్తకుడు తన మనస్సులో ప్రతిష్టించుకొన్న ఆ దివ్యమూర్తి పైని స్తోత్రగీతాలూ, ద్రువాలు పాడుతూ నర్తన మాడేడు. అందుకు తగినట్టుగా మార్దాంగికుడు మృదంగం వాయించాడు. ఇది గేయ ప్రాధాన్యం గల నర్తకం కాదు. ఇది వాద్య ప్రాధాన్యం గల నర్తకం. ఇది శివకేళికా విలాసం. ఇదే నవరసాలు గల అంగహార నర్తనం. తన అవయవాల, అంగ ప్రత్యంగ, ఉపాంగాల సంచలనాల ద్వారా పరమశివుడు నవరసాలనూ సృష్టించి తన భక్తులలో సంచలనం కలిగిస్తాడు.
ఈ అంగహార నర్తనమాడడం చాలా కష్టం. దీనికి వాయిద్యాలను వాయించడం అంతకంటే కష్టం. నవరసాలను మార్దాంగికుడు తన మహామద్దెలపైన పలికించాలి. ప్రతి రసం ఆ నాదంలో సంపూర్ణంగా గోచరించాలి. ఒక్కొక్క రసం వివిధ సంచారులను ప్రకాశింపజేసి, విహరించి అదృశ్యమై, వేరొక రసానికి తావివ్వాలి.
ఈ నాదోపాసన కడు రమ్యంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది. అయితే, ఇది ఊహించడానికి అలవి కానంత కష్టమైంది. ఒకానొక భావంతో శోభించే మూర్తిని నర్తకుడు తనలో ప్రతిష్టింపజేసుకొన్న తర్వాత నవరసాలను సాత్విక సంచారులను పాటా, మాటా లేకుండా కేవలం వాద్యగోష్టి సహకారంతో ఆ నర్తకుడు ప్రదర్శించడం చాలా కష్టం.
ఈ విధంగా తన శరీరాన్ని నవరసాలకు నర్తకుడు ఆలవాలం చేసుకొన్న తర్వాత శివపార్వతుల మహా విలాస నర్తనాన్ని అతడు ప్రదర్శించాలి. ఇది ప్రణవానంతరం ప్రదర్శించే ప్రణయ నర్తనం.
వసంతకాలంలో ఒకనాటి సాయం సంధ్యా సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో సంధ్యా సూర్యుని అరుణ కాంతులకు కైలాసగిరులు మిలమిల మెరిసి పోతుండగా, చల్లని పిల్లవాయువులతో పుష్పసౌరభాలు ఆ ప్రాంతంలో ప్రసరిస్తూంటే జగదంబ తన్మయురాలై తాండవ మాడమని శివుని కోరింది. పరమశివుడు ప్రసన్నుడై పారవశ్యంతో ఆమె కోరినట్టుగా నర్తనమాడేడు. అదే శృంగనర్తనం. కైలాస శిఖరంపైని శివుడు ఈ సంధ్యా నర్తనాన్ని ప్రదర్శించాడు గనుక దీనికి ఆ పేరు వచ్చింది.
తాళ, లయ, గతి, గమనాల రూపంలోను, స్వరాల రూపంలోను గల నాదోపాసన ఈ నర్తకంలో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. తర్వాత మొదటిసారి భాషకు, భావానికి ప్రాధాన్యం లభిస్తుంది. అక్షర రూపంలో గల ఒక భావంతో ఈ నాదం బంధింపబడుతుంది. భరతాన్ని ఎన్ని విధాల, ఎన్ని రకాలుగా ప్రదర్శించినా అది భావ, రాగ, తాళాలనే మూడు ప్రక్రియల కిందకే వస్తుంది. అలాగే, ఎన్ని రీతుల్లో నాదం వికసించినా అది ప్రణవ, ప్రణయ, ప్రళయ నాదాలనే మూడు రూపాల కిందకే వస్తుంది.
వివిధ రకాలైన పాటలకు, పద్యాలకు, గద్యాలకు, గీతాలకు ఆఖరికి వేదాలకు, స్మృతులకు, ఉపనిషత్తులకూ నాట్యాన్ని ఎన్ని రకాలుగా ప్రదర్శించినా అది నృత్త, నృత్య, అభినయన అనే మూడింటిలో ఏదో ఒక దాని కిందకే వస్తుంది. వీటిని మించి అది ఉండదు. అందువల్ల పరమశివుడు పరవశుడై ప్రదర్శించిన తాండవం కూడా ఈ మూడింటిలో ఏదో ఒకదాని కిందకే వస్తుంది.
ప్రణవ స్వరూపుడైన శివుని స్తోత్రం చేస్తూ వాద్యమేళాల వారు పాడితే సృష్టి క్రమాన్ని తెలియజేసే ఆంగికం నృత్త, నృత్యాలతో విరాజిల్లుతుంది. ప్రణయ స్వరూపుడైన ఆ దేవదేవుని కీర్తిస్తూ పాడితే సృష్టిక్షికమాన్ని తెలియజేసే ఆ నర్తనం కరణ, చారీ, ఆంగహారాల సంపుటీకరణంతో సమ్మిళితమై ఉంటుంది. ప్రళయమూర్తిగా ఆ ఆదిదేవుని స్తుతిస్తూ పాడితే రుద్రమూర్తి తిరోగమనంతో చివరకు అనుక్షిగహమూర్తి వికాసంతో ఆ నృత్య, నృత్తాలు ముగుస్తాయి. ఇంతటి వికాసవంతమైన నర్తన మాడటానికి ఈ శృంగంలో అవకాశముంది.
ఆ నర్తనంలో నర్తకుడు తన నృత్యకళా పాండిత్యాన్ని, ప్రతిభను ప్రదర్శించవచ్చు. కేవలం భక్త్యావేశాలనే కాక నర్తకుడు అపూర్వ తాళ, ఛందస్సులలో తన నాట్య విద్యను ఈ నర్తనంలో ప్రదర్శించవచ్చు.
ఈ శృంగనర్తనం తర్వాత నర్తకుడు తన కిరీటాన్ని తీసి వేసి, విషమాన్ని లేక వికటాన్ని ప్రదర్శించాలి. అనేక విధాలైన అనుకరణ నర్తనాలను దీనిలో ప్రదర్శించవచ్చు.
చివరకు భావాక్షిశయ మహానర్తనాన్ని నర్తకుడు ప్రదర్శిస్తాడు. దీంతో ప్రేరణ నర్తనం ముగుస్తుంది.
పంచమూర్తులనే పృథ్వీ, జల, తేజో, వాయు, ఆకాశ లింగమూర్తులను స్తోత్రం చేస్తూ, పంచముఖ శబ్ధాలతో ఈ నర్తనాన్ని నటుడు ప్రదర్శిస్తాడు. ఇది ప్రేరణకు పరాకాష్ట. దీనిని మించిన నృత్యం లేదు. దీనికి మించిన శబ్ధజాలం లేదు.
ఈ శబ్ధ్దజాలం వర్షాన్ని కురిపిస్తుంది. అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. వాయుదేవుని ప్రకోపింప జేస్తుంది. పృథ్వీ స్వరూపాన్ని తెలియజేస్తుంది. అనంతమైన ఆకాశాన్ని గుర్తుజేస్తుంది. ఈ నర్తనం సంగీత విద్యాసారం.
ఈ నర్తనంలో ప్రదర్శింపబడే జతులు 5, 25, 125 ఉంటాయి. ఈ నర్తనానికి నట్టువాచార్యుడు ఈ శబ్ధ్దాలను పలుకుతూ తాళాలను మోగిస్తూంటే, వాయిద్యాలను వాద్యకులు వాయిస్తూంటే నర్తకుడు లేక నర్తకులు ఆడుతూంటే పరమశివుడు పరవశుడై అంబా సమేతంగా ఈ నర్తనాన్ని తిలకించడానికి కైలాసాన్ని వదిలి కదలి వస్తాడనడంలో సందేహం లేదు. ఈ నర్తనం ముగిసిన తర్వాత కొద్ది నిమిషాలపాటు వాద్యగోష్టి కొనసాగుతుంది. ఆ తర్వాత స్వామికి హారతి నివ్వడంతో ఈ నాట్య కచ్చేరీ ముగుస్తుంది. అప్పుడు నర్తకుడు ఆ బలిపీఠం వద్దనే కొంతసేపు విశ్రాంతి తీసికొని, బడలిక తీర్చుకొని ఉపశమనం పొంది వెళ్తాడు. ఇది ఈ ప్రేరణ నర్తన క్రమం.
ఇది జాయప్ప తెలియజేసిన ప్రేరణ నర్తన క్రమం. ఇది శైవ సంప్రదాయం. నృత్త రత్నావళి, శైవాగమాల ఆధారంగా నేను పునఃసృష్టి చేసిన పేరిణీ నర్తన సంక్షిప్త చరిత్ర ఇది.
బృహన్నల విరాటరాజు కొలువులో ఉత్తరకు పేరిణీ నృత్యాన్ని నేర్పినట్టు తిక్కన తన భారతంలో వర్ణించిన పద్ధతి వేరు, ఇది వేరు. కన్నెపడచులకు ఉపకరించే కైశికీ వృత్తి ప్రధానంగా గల నృత్యం అది. ఇది శివుని ప్రార్థిస్తూ పురుషులు ప్రదర్శించే తాండవ పద్ధతికి చెందిన వీరనాట్యం. ఈ రెండు విభిన్న రీతులకు చెందినవి. తిక్కన వర్ణించిన స్త్రీల లాస్య సంప్రదాయాన్ని అనుసరించే తంజావూరు కోటలో ఆస్థాన నర్తకీమణులు పేరిణిని ప్రదర్శించేవారు.
అప్పటి తెలుగు మహాసభలు
వాగ్దాన భంగం
జలగం వెంగళరావు ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడే ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తొలి రోజునే సాంస్కృతిక కార్యక్షికమాలలో పేరిణిని ప్రదర్శించాము. అందరూ ముగ్ధులయ్యారు. మా పేరిణి కళాకారులకు ఆ సభలకు వచ్చిన ప్రపంచ తెలుగు ప్రతినిధుల సమక్షంలో రామప్ప దేవాలయంలో శివ కిరీటాలను పెడతామని ఆంధ్రవూపదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు వాగ్దానం చేశారు. ఇంకా ఈ పేరిణీ శివతాండవం విశ్వవ్యాప్తమౌతుందని నేను మురిసిపోయాను.
ఒకనాటి కార్యక్షికమంలో రామప్ప దేవాలయాన్ని పదివేల ప్రమిదల దీపకాంతులతో అలంకరించి, రుద్రవూపేరణ నృత్యాన్ని ప్రదర్శించి పేరిణి కళాకారులకు శివ కిరీటాల బహుకరణకు ఏర్పాట్లు చేసుకోమని ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంక కొద్ది గంటల్లో బయలుదేరతామనగా ఆ కార్యక్షికమానికి సంబంధించిన కాగితం నాకు అందింది. ఆ కార్యక్షికమ ఏర్పాటులో ఏ పెద్ద మనిషి అదృశ్య హస్తముందో గాని ప్రపంచ తెలుగు మహాసభల ప్రతినిధుల రామప్ప దేవాలయ సందర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏర్పరచబడింది. మరి, ఆ సాయంత్రం మా నృత్య కార్యక్షికమం లేనట్టే అని అర్థమైంది. నా గుండె ఆగినంత పని అయింది. వెంటనే బాపుడ్డి వద్దకు, ఆయన సలహా మేరకు విద్యామంత్రి వద్దకు పరుగెత్తాను. ఆ మంత్రివర్యులు అంతా విని ‘‘ఎక్కడో పొరపాటు జరిగింది. ఏం చేస్తాం? ఇంకోసారి ఈ కిరీట ప్రదానం ఏర్పాటు చేసుకుందాం’’ అన్నారు.
ఎవడో ఈర్ష్యాపరుడు దొంగచాటుగా వెన్నుపోటు పొడిచాడు. అంతమాత్రం చేత నిరుత్సాహపడకూడదని నిశ్చయించుకొని, అంతవరకు ప్రదర్శనలిస్తున్నట్టే కిరీటాలు లేకుండానే ప్రదర్శనలు ఇవ్వదలచాను. పదివేల ప్రమిదల దీపకాంతులతో రామప్ప దేవాలయంలో పేరిణీ శివతాండవాన్ని ప్రదర్శించాలన్న కోర్కె మాత్రం అలాగే ఉండి పోకూడదన్న తలంపుతో కృషి చేశాను.
1985లో నా కోర్కె నెరవేరింది. శివరాత్రి పర్వదినాన ఉదయం మొదలుకొని లింగోద్భవ కాలం వరకు శైవాగదు సంప్రదాయానుసారం వివిధ వేళల్లో వివిధ నాట్యాలను చేయించాను. ఆ రాత్రి పదివేల ప్రమిదల దీపాలతో రామప్ప దేవాలయాన్ని అలంకరించి, నాలుగు లక్షల మంది భక్తుల సమక్షంలో పేరిణీ శివతాండవాన్ని వందమంది కళాకారులు ప్రదర్శించారు. ఏడు వందల సంవత్సరాల తర్వాత మళ్లా ఆ మహానటుడు తన పేరిణి శివతాండవాన్ని వీక్షించాడు. నేను నా దేశ ఋణం తీర్చుకొన్నాను. ధన్యుణ్ణయ్యాను.
కాకతి స్వయంభూ దేవుడు అనుమతించే వరకు శివ కిరీటాలు లేకుండానే పేరిణి శివతాండవ ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి.
పునఃసృష్టి క్రమం...
ఈ పేరిణీ తాండవాన్ని పునఃసృషించడానికి నాకు పది సంవత్సరాలు పట్టింది.
ఈ శివతాండవం గురించి కాళహస్తిలో మా గురువు రాజమ్మ చెప్పగా నేను మొదటిసారి విన్నాను. తంజావూరు వెళ్లినప్పుడు సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని ఒక శిథిల రాతవూపతిలో దీనిని గురించి చదివాను. మన పురాణాలలోను, చారివూతక గ్రంథాలలోను దీనిని గురించిన వర్ణనలు పరిశీలించాను. శైవ ఆరాధనా గ్రంథాలలో గల శివవూపేరణ విధానాలను ఆకళింపు చేసుకొన్నాను.
శుద్ధ, దేశి, ప్రేరణ, ప్రేంఖణ, దండిక, కుండలి, కలశ అనే ఈ ఏడూ ప్రత్యేకమైన శివుని తాండవాలు. ఈ నర్తనాల గురించి ప్రత్యేకంగా పరిశోధన చేశాను. ఇవి విశిష్టమైన తాండవాలని గ్రహించి పేరిణి శివ తాండవాన్ని రూపొందించాలని నిశ్చయించుకొన్నాను. నృత్త రత్నవళి దీనికి ప్రధానమైన ఆధార గ్రంథం. గనుక దానిని ముందుగా మరొకసారి అధ్యయనం చేశాను. దీనికి ప్రతిబింబాల వంటి నృత్య భంగిమలు పాలంపేట రామప్ప దేవాలయంలో ఉన్నాయి. కనుక అక్కడికి అనేకసార్లు వెళ్లి ఆ నృత్య భంగిమలను అభ్యసించాను. రామప్ప ఆలయాన్ని చూడడానికి పాలంపేట వెళ్లడం వ్యయ ప్రయాసలతో కూడుకొన్న పని. ఆ రోజుల్లో ఇంకా కష్టంగా ఉండేది.
ఈ పేరిణి ఒక విశిష్ట కళారూపం. తెలుగు వీరులు రుద్ర ప్రేరణగా ప్రదర్శించి, లోకానికి అందించిన వీరనాట్యం. ఇలాంటి వీరనాట్యం ప్రపంచంలో వేరేచోట లేదని నేను గట్టిగా చెప్పగలను. దీనిని ఎలాగైనా పునః సృష్టించాలన్న సంకల్పం నాకు కలిగింది. ఈ సంకల్పం వల్లే ఓర్పుతో శ్రమించాను. నా శ్రమకు ఫలితం దక్కింది. మళ్లా మరొకసారి నృత్య సంప్రదాయాలను పరిశీలించాను. ఆ సాంప్రదాయక అడవులు, అడుగులు, జతులు, తాళాలు మొదలైనవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, కాలగర్భంలో కలిసిపోయిన, సుమారు వేయి సంవత్సరాలు మరుగున పడివున్న ఈ శివ తాండవాన్ని పునః సృష్టించాను. నా విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇచ్చాను. మగవారిలోని మగటిమిని, పురుషుల్లోని పురుషత్వాన్ని, వీరునిలోని వీరత్వాన్ని చాటిచెప్తూ వేయి సంవత్సరాల క్రితం శివార్చితంగా కాకతీయ వీరులు ప్రదర్శించిన ఈ పేరిణి శివతాండవాన్ని నా శిష్యులు మళ్లా ప్రదర్శించగలిగారు.
మహేశులు, మైలారు దేవులు, వీరులు, పశుపతులనే శైవులు ఈ నర్తనాన్ని ప్రదర్శించేవారు. ‘వీరు ఎవరు? సంఘంలో వీరి స్థానమేమిటి?’ అని యోచించాను. వీరిని గురించి పరిశోధించదలిచాను.
హైదరాబాదులో మైలారుగడ్డ అనే ప్రాంతమొకటి ఉంది. ఈ నగరానికి పది మైళ్ళ దూరంలో మైలారుదేవ పల్లె అనే గ్రామ మొకటుంది. ఇలాంటి పేర్లతో పలుచోట్ల మరికొన్ని పల్లెలున్నాయి. ఈ పల్లెలలో కొన్నింటికి స్వయంగా వెళ్లాను. ఈ పల్లెల్లో ‘వీరకల్లు’ అని చెక్కబడివున్న రాళ్ళు ఉన్నాయి. ఊరి మధ్య, ఊరి వెలుపల అమ్మవారి గుడుల వద్ద ఉండే రాళ్ళుగాని, పోతరాజు రాళ్ళుగాని కావు ఇవి. ఈ ‘వీరకల్లు’ రాళ్ళను ఆయా గ్రామవూపజలు గౌరవంతో పూజిస్తున్నారు.
ధూప, దీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ‘వీరు ఎవరని వీరు ఇవన్నీ చేస్తున్నారు?’ దేశం కోసం, దేశ ప్రజల కోసం శత్రువుల నుండి దేశాన్ని రక్షించడం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి స్మారక చిహ్నాలు ఈ రాళ్ళు. ఈ శిలలపై శిల్పాలను చెక్కించి మరీ స్థాపించారు. ఈ ప్రాణత్యాగం చేసినవారంతా శైవులే. శివారాధనలో వీరు ప్రేరణ నృత్యాన్ని చేసినవారే. సైన్యాలు రణరంగానికి వెళ్ళేటప్పుడు రుద్ర ప్రేరణ చేసేవారు. ఈ విధంగా వేయి సంవత్సరాల పాటు మరుగున పడివున్న చారివూతక విషయాలను చాలావరకు సేకరించాను. ఆనాడు ఈ విషయాలను సేకరించడానికి నేను ఎంతో శ్రమించవలసి వచ్చింది.
అయితే, ఈ విషయాలను గ్రంథస్తం చేసి తెలుగు ప్రజలకు తెలియజేయడానికి నేను మరింత కష్టపడవలసి వచ్చింది. అయినా, ఒక దశాబ్ది పరిక్షిశమ ఫలించింది. ఈ పేరిణీ తాండవాన్ని ఒక కళారూపంగా తీర్చిదిద్ది మీకు సమర్పించగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందం నా శ్రమను మరిపించింది. నేడు ఈ కళ మన భారతదేశంలో ప్రచారం పొందింది. ఇది విశ్వవ్యాప్తం కాగలదని ఆశిస్తున్నాను. ఆంధ్రులు భారతీయ నృత్యకళకు అర్పించిన వీరనాట్యం ప్రఖ్యాతమైంది. ఇది విశ్వవ్యాప్తమైన నాడు నాకు పరిపూర్ణానందం కలుగుతుంది.
వివిధ శివుని కథలలో వివిధ సందర్భాలలో శివుడు ప్రదర్శించిన తాండవం ఇదని తెలియజేసే ప్రదర్శనలు ఒక రీతివి. ఈ పేరిణి అటువంటిది కాదు. శివశక్తిని ప్రేరేపించి, దానిని తనపైకి ఆవహింప చేసికొని, ఆ శివశక్తికి తన శరీరాన్ని ఒక సాధనంగా చేసి ఒక నటుడు ప్రదర్శించే నర్తనం ఇది. ఇది ప్రధానంగా ఆధ్యాత్మికమైన, ఉధృతమైన కళారీతి. దీని వాయిద్య రీతే వేరు. ఇది ఆవేశ పూరితంగా శుద్ధ తాండవ రీతిలో ఉంటుంది. మహా మద్దెలలో ఉత్పన్నమయ్యే ఈ నాదం ఎన్నెన్ని తీరులలో వికసించగలదో అన్నన్ని తీరుల్లో ఈ భావం ఉత్పన్నమయ్యేటట్టుగా ఈ సంప్రదాయముంటుంది. ఇతర శివతాండవాలలో ఈ తీరు కనబడదు. దీనిలో నృత్త ప్రాధాన్యం ఎక్కువగా గోచరిస్తుంది. దీనిలోని ఉధృతమైన లయవేగం వేరొక నర్తన రీతిలో లేదు. భారతదేశంలోనే కాదు, యావవూత్పపంచంలోనే ఇంత అత్యంత వేగం గల నృత్త సంప్రదాయం మరొకటి లేదు.
ఈ పేరిణి నర్తనం గురించి నేను పది సంవత్సరాలు పరిశోధించి, దీనికి తగిన మృదంగ బాణీని సమకూర్చడానికి ద్రుపద మృదంగ బాణీని ముందుగా అవగాహన చేసికొన్నాను. ఆ తర్వాతే ఈ పేరిణీ శివతాండవానికి ఒక ప్రత్యేక శైలిని రూపొందించాను.
శివతాండవం వేరు...పేరిణి వేరు
ఉత్తరాది, దక్షిణాది బాణీలుగా మన సంగీతం విడిపోక ముందు, సంస్కృత భాష మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండిన పూర్వకాలంలో దైవబాణీగా ద్రువగాన పద్ధతి ప్రచారంలో ఉండేది. ప్రాంతీయ భాషల ప్రభావం పెరిగిన కొద్దీ ఉత్తరాదిలో బ్రిజభాషకు ప్రాముఖ్యం పెరిగింది. దక్షిణాదిలో తెలుగుభాష సంగీత భాషగా గుర్తింపబడింది. ఆ తర్వాత ఉత్తరాది సంగీతం తురుష్కుల ప్రభావానికి, పర్షియన్ ప్రాబల్యంతో రూపొందిన మత ప్రభావానికి లోనై ఒక ప్రత్యేకబాణీగా రూపొందింది. ప్రాచీన దేవభాషకు ఉత్తరాదిలో ప్రభావం తగ్గుతూ వచ్చింది. అలాగే, దక్షిణాదిపై తమిళ, కన్నడ, మళయాళ భాషల ప్రభావం ఉన్నా వీటన్నింటిలో తెలుగు భాషా ప్రభావం సంగీతంపైన ఎక్కువగా ఉంటూ వచ్చింది.
అందువల్ల దక్షిణాది సంగీతం ఒక విశిష్టరీతిని పెంపొందింది. దక్షినాదిన దేవభాష ప్రాముఖ్యం తగ్గినా మన ప్రాచీన సంస్కృతి ప్రభావం తగ్గలేదు. ఉత్తరాదిన విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల అక్కడి సంగీత కళలో మార్పులు వచ్చాయి. సితారా, తబలా వంటి కొన్ని వాయిద్యాలను అమీర్ కుష్రూ ప్రవేశపెట్టడంతో ఉత్తరాది సంగీతం బాగా మారిపోయింది. దృపద సంగీత ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ఖ్యాల్ సంగీత ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. ఉత్తరాది దృపద బాణీలో ప్రముఖంగా ఉండిన మృదంగ వాయిద్యం అంతరిస్తూ, తబలా వాయిద్యం చోటు చేసుకొంది. ఉత్తరాది నాట్య రీతిగూడా తబలా వాయిద్యానికి తగినట్టుగానే మారుతూ వచ్చింది.
ఇందుకు భిన్నంగా దక్షిణాదిన దృపద బాణీ ఉంటూనే ఆధునిక కర్ణాటక బాణీ పెంపొందింది. ప్రాచీన సంగీత బాణీలో కొద్దిపాటి మార్పులు వచ్చినా దక్షిణాదిన దాని ప్రాముఖ్యం పూర్తిగా అంతరించలేదు. ఏభై సంవత్సరాల క్రితం వరకు ముఖ్యంగా భాగవత సంప్రదాయంలో ఈ దృపద బాణీ బహుళ ప్రచారంలో ఉండేది. కాని, ప్రస్తుతం ఇది మరుగున పడుతూంది. నేను ఆంధ్రదేశం వచ్చిన కొత్తలో ఈ దృపద బాణీలో వాయించే మార్దాంగికులు సుమారు నూరుమంది ఉండేవారు. ఈ బాణీలో పాడే కళాకారుల బృందాలు గూడా నూరు వరకూ ఉండేవి. అయితే, పై మార్పులు ఒక్కసారిగా రాలేదు. కొన్ని దశాబ్దాల కాలంలో క్రమంగా వచ్చాయి.
నేను నృత్యకళను ఉత్తరాది, దక్షిణాది బాణీలు రెంటింటిలోను అభ్యసించాను. రెండింటినీ శాస్త్రోక్తంగా క్షుణ్ణంగా, కట్టుదిట్టంగా అభ్యసించాను. ఈ రెండు బాణీలలోని వృత్యాసాలు నాకు తెలిసినంత ఈనాడు ఇంకే నృత్య కళాకారుడికి తెలియవనుకొంటాను. అందువల్ల నేను పేరిణి శివతాండవాన్ని పునఃవూపతిష్ట చేస్తున్నప్పుడు తగినంత జాగ్రత్త వహించాను.
అసలు విషయాన్ని గాని, ఇతరుల కృషిని గాని అర్థం చేసుకొనే ఓర్పుగాని, సంస్కారం గాని, విద్యగాని లేని కొందరు నేను పేరిణీ శివతాండవాన్ని నా శిష్యుల ద్వారా ప్రదర్శించినప్పుడు చూసి ‘ఆఁ... అందులో ఏముంది? కథక్ నృత్యం లాగానే ఉంది. దీనికి ప్రత్యేక విశిష్టత ఏముంది?’ అంటూ పెదవి విరిచారు. ఈ అజ్ఞానుల విమర్శలను పట్టించుకోనవసరం లేదని నేను నమ్ముతున్నాను. తెలిసిన వారి విమర్శకు సమాధానం చెప్పవచ్చు. తెలియని వారికి విడమర్చి చెప్పవచ్చు. ఈ తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానవంతులు తమకు అంతా తెలుసుననుకుంటారు. వీరికి తెలియజేయడం ఆ బ్రహ్మవశం కూడా కాదు. ఒక్కసారి భర్తృహరి సుభాషితాన్ని తలుచుకొని మౌనంగా నవ్వుకొన్నాను.
ఈ సందర్భంలో పేరిణి శివతాండవంలోని కొన్ని ముఖ్యాంశాలను వివరించదలచాను. పేరిణిలో ‘తహన’ విన్యాసముంది. నాకు తెలిసినంత వరకు ఈ తహన విన్యాసం కథక్ నృత్యంలో లేదు. కథక్లోనే కాదు, మరే భారతీయ నృత్యంలోనూ లేదు. పేరిణిలో ‘యతి’ నర్తనం ఉంది. ఇది జతి నర్తనం కాదు. మొహర ముక్తాయుల నర్తనం అసలే కాదు. వివిధ యతుల అనుసరించి ఈ నర్తనాన్ని కూర్చారు. ఈ యతి నర్తనమూ ఏ ఇతర సంప్రదాయంలోనూ లేదు. అసలు ఈ యతి నర్తన ప్రయోజనమే వేరు. దీనికి ఇతర నర్తన రీతులలో స్థానం లేదు.
ఇంక ‘నవరస అంగహారా’ల్లోని జతి కట్టుబాట్లు గాని, ఇటువంటి శబ్దాలుగాని ఉత్తరాది ఫకవాజ్ మృదంగ వాయిద్యంలో లేవు. అభినవ నందికేశ్వరుడన దగిన అయోధ్యా ప్రసాద్ ఫకవాజ్ వాయిద్యం నేను విన్నాను. వారి శివతాండవ శబ్ధజాలాన్ని విన్నాను.
మధ్యవూపదేశ్ రాష్ట్రాని కంతటికీ ప్రసిద్ధిగాంచిన ఫకవాజ్, తబలా వాయిద్యకులు గోవిందరావు పంత్పాండే సేవ చేసి వారివద్ద దృపదబాణీ నేర్చుకొన్నాను. మహారాష్ట్రలో ప్రఖ్యాత విద్వాంసుడుగా పేర్గాంచిన సకారామ్ పంత్ ఫకవాజ్ వాయిద్యం విన్నాను. ఆ పద్ధతిలో గల పాటవాక్షరాలను, వివిధ తాళాల బీజాక్షరాలను, ఖాయిదాలను క్షుణ్ణంగా నేర్చుకొన్నాను. ఆ బాణీ వేరు ఈ నవరస అంగహార పద్ధతిలోని కట్టుబాట్లు, శబ్ధజాలాలు వేరు. రాయపూర్ రాజా చక్రధర్ సింగ్ కథక్ నృత్యంలో గొప్ప విద్వాంసులు. ఆయన దర్బారులో లక్నో ఘరానా, జయపూర్ ఘరానా, కథక్ నృత్య కళాకారులనేకులు ఉండేవారు.
ఈ ప్రాచీన కథక్ బాణీల తాండవ నర్తన శబ్ధాలలానే కాక ఆయన ఎన్నో నూతన శబ్ధజాలాలను సృష్టించి వాయించేవారు. ఆ తాండవాలు వేరు. ఈ పేరిణి శివతాండవంలోని శృంగ నర్తనం వేరు. ఆ శివతాండవ నర్తనాల భావనే వేరు. అవన్నీ శివుని కథలను అనుసరించి రూపొందించబడిన కరణాంగహారాలు.
సృష్టి, స్థితి, లయల భావనపై ఆధారపడి పెంపొందిన కరణాంగహారాలు ఈ శృంగ నర్తనంలోనివి. దీనిలోని ఏకాదశ రుద్రవర్తనం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర నర్తనాలతో ఉత్తరాది బాణీకి ఎటువంటి సంబంధం లేదు.
కనీసం ఇటువంటి శబ్ధ్దజాలాలు ఫక్వాజ్ వాయిద్యంలో ఏమైనా మిగిలి ఉన్నాయా అంటే అదీ లేదు. మరి, ఈ పేరిణీ శివతాండవంలోని ఏ అంశం కథక్ నృత్యంలా ఈ కువిమర్శకులకు కన్పించిందో నాకు అర్థం కాలేదు. ఈ పేరిణిలో గల వేగాన్ని బట్టి వీరు ఇలా అనుకున్నారేమో! వీర రస ప్రాధాన్యం గల ఉధృత తాండవ రీతులన్నీ అతి వేగంతో చేయబడతాయి. వీరావేశం గలవి. విలంబితయలో ఉండవు. ఒకవేళ లయ విలంబితమైనా మూడు కాలాలలోను నర్తనం విజృంభిస్తుంది. నృత్యశాస్త్ర పరిజ్ఞానం ఈ కువిమర్శకులతో చర్చించినా ప్రయోజన ముండదు.
మరో చివరి విషయం, ఈ ఇరవయ్యో శతాబ్దిలో మళ్లా నూతనంగా ప్రచారంలోకి వచ్చిన ప్రాచీన ప్రక్రియ ఈ ‘పేరిణి శివతాండవం.’ దీనిలో మగవారు పాల్గొని చక్కగా ప్రదర్శించి, ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. దీనిని మెచ్చుకుని, నన్ను అభినందించారు.
సుమారు వేయి సంవత్సరాలుగా మరుగునపడిన ఈ పురుషోన్ముఖమైన కళను వెలికి తీసినందుకు అనేకమంది సంతోషించారు. కాని దీనివల్ల వారి కొంపలు అంటుకుపోతాయేమోనని కొద్దిమంది నృత్యకళాకారులే భయపడ్డారు. ఇది ప్రాచుర్యంలోకి వస్తే వారికి అపకారం జరిగి పోతుందేమోననీ వారు శంకించారు. కనుక, దీనిని ఈసిడించదలిచారు. ‘‘ఇదొక జానపద నర్తనం. అమ్మవారి సంబరాలలో ప్రదర్శించే నర్తనాల లాగ ఉంది’’ అన్నారు. బహుశా ఈ విమర్శకులు జాయప పేరు విని ఉండరు. ఆయన రచించిన ‘నృత్య రత్నావళి’ అనే గ్రంథమొకటి ఉందనీ వీరికి అసలు తెలిసి ఉండదు.
దివ్య స్మృతికి: కాకతీయుల కాలం నాటి పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించిన శ్రీ నటరాజు రామకృష్ణ సమాధి ‘తారామతి బారాదరి’ చెంత అశ్రద్ధకు గురయ్యే ఉంది. ఆయన స్మృత్యార్థం ప్రభుత్వం హామీ ఇచ్చినవైనా పూర్తి చేయవలసే ఉంది. అలాగే, ఈ ఉత్సవ సందర్భంలో ఆయన్ని మననం చేసుకోవడానికి ఉత్తమ మార్గం, వారు పునరుద్ధరించిన పేరిణికి ఆదరణ పెంచడం, పేరిణి నృత్య కళామండపం నిర్మించడం, ఆ కళాకారులకు తగిన ప్రోత్సహం కల్పించడం. ఇందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మన కర్తవ్యం.
(నటరాజు రచించిన ‘ఆంవూధనాట్యం (పేరిణి -నవజనార్ధన పారిజాతం)’ గ్రంథం నుంచి...)
No comments:
Post a Comment