Monday, 17 December 2012

ఇదీ ఎన్‌ఎంయూ అసలు రంగు - సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేసింది తామేనని ప్రకటన


ఇదీ ఎన్‌ఎంయూ అసలు రంగు
- సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేసింది
తామేనని ప్రకటన
కృష్ణాజిల్లా అవనిగడ్డలో వెలిసిన బ్యానర్లు
ఇక్కడ జై తెలంగాణ.. సీమాంవూధలో నై తెలంగాణ
 పై ఫొటోను చూశారా..? ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) ఆడుతున్న డబుల్ గేమ్‌కు నిదర్శనమది. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తాము అనుకూలమని ప్రచారం చేస్తూనే.. సీమాంధ్రలో తాము తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అణగదొక్కిందీ బ్యానర్ల రూపంలో ఎన్‌ఎంయూ ప్రదర్శిస్తోంది. పై బ్యానర్ ఇందుకు ఓ మచ్చు తునక! ‘సకలజనుల సమ్మెను నిర్వీర్యం చేసి, సంస్థను కాపాడి.. కార్మికుల జీవితాలను రక్షించిన కాగడాకే మన ఓటు’.. అంటూ వెలిసిన ఇలాంటి ఎన్‌ఎంయూ బ్యానర్లు కృష్ణా జిల్లా అవనిగడ్డలో కోకొల్లలు. వీటిని నిజామాబాద్‌కు చెందిన ఆర్టీసీ కార్మికులు సోమవారం బయటపెట్టారు.

ఇటీవల సీసీఎస్ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ)ను గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో దెబ్బతీసేందుకు తెలంగాణలో ఉద్యమానికి అనుకూలంగా.. అటు ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) జోరుకు సీమాంవూధలో బ్రేకులు వేసేందుకు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఎన్‌ఎంయూ నేతలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఈ డబుల్‌గేమ్‌ను సహించేది లేదని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచస్థాయిలో ఎలుగెత్తిచాటిన సకలజనుల సమ్మెను అణచివేసేందుకు ఎన్‌ఎంయూ కుట్ర పన్నిందని, సీమాంవూధలో ఆ యూనియన్ ప్రచారాన్ని చూస్తేనే అది తెలుస్తుందని వారు అంటున్నారు. ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో టీఎంయూ, ఈయూ కూటమిగా ఏర్పడి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment