Thursday, 6 December 2012

ఓయూలో విద్యార్థుల ర్యాలీ

ఓయూలో విద్యార్థుల ర్యాలీ
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న గాయని విమలక్కపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో విద్యార్థులు ర్యాలీ తీశారు. తక్షణమే విమలక్కను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాకకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులను పోలీసులు ఓయూ పీఎస్ వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

No comments:

Post a Comment