Wednesday, 19 December 2012

మరోసారి బయటపడ్డ సీమాంధ్ర సర్కారు వివక్ష


మరోసారి బయటపడ్డ సీమాంధ్ర సర్కారు వివక్ష
 సీమాంధ్ర సర్కారు తెలంగాణ ప్రజలపై వివక్ష మరోసారి బయటపడింది. మరోసారి కాంగ్రెస్ - టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి. సర్కారును నిలబెడుతున్నందుకు కిరణ్ సర్కారు కృతజ్ఞతతో టీడీపీ నాయకులపై కేసులు ఎత్తివేయడానికి జీవో నంబర్ 2219ని విడుదల చేసింది. తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలని ప్రశ్నించినందుకు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ లాయర్లపై దాడిని ప్రోత్సహించిన చంద్రబాబు, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లపై కేసులు ఎత్తివేసింది. మరోవైపు హైకోర్టులో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించినందుకు తెలంగాణ లాయర్లపై ప్రాసిక్యూషన్ పేరుతో సర్కారు వేధింపులకు గురి చేస్తుంది.

No comments:

Post a Comment