లత్కోర్ మాటలు ఎవరు నమ్మరు : కేసీఆర్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పెద్ద లత్కోర్ అని ఆయన మాటలు ఎవరు నమ్మరని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ద్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న మాట టీడీపీ అఖిలపక్షంలో ఇచ్చిన లేఖలో ఎక్కడా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. దీనికే ఎదో పొడిచినట్లు కొందరు బాబు చెప్పులు మోసేటోల్లు ఎగిరిగంతేస్తున్నారని ఆయన విమర్శించారు. 2008 లేఖకు కట్టుబడి ఉన్నామన్న వ్యాఖ్య కూడా నిన్నటి లేఖలో లేదని ఆ లేఖ ప్రతిని మీడియాకు చూపించారు.
No comments:
Post a Comment