హన్మకొండలో కేయూ విద్యార్థుల అరెస్ట్
వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో రాత్రికి రాత్రే వెలసిన వైఎస్సార్సీపీ జెండాలు వెలిసాయి. దీంతో యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలను తొంగించి దహనం చేశారు. అనంతరం తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని కొండా సురేఖ ఇంటిని ముట్టడించడానికి యత్నించారు. దీంతో ఒక్క సారిగా విద్యార్థులపై కొండా సురేఖ అనుచరులు దాడికి పాల్పడి విచక్షణ రహితంగా కట్టెలతో చితకబాదారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల అరెస్టును టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులపై దాడి చేసిన గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment