Tuesday, 18 December 2012
పచ్చని పల్లెలపై ఓపెన్ మన్ను
పచ్చని పల్లెలపై ఓపెన్ మన్ను
పచ్చని పల్లెలపై ‘సింగరేణి’ మన్నుబోసింది. వీలైనంత తక్కువ సమయంలో తెలంగాణ సంపదను కొల్లగొట్టాలనే సీమాంధ్ర సర్కారు కుట్రలోంచి ‘ఓసీపీ’ భూతం నిద్దురలేచింది. అంతకంతకూ కోరలు చాస్తూ, వందలాది గ్రామాలను బొందలగడ్డలుగా మార్చి అమాయక ప్రజల బతుకులను ఆగం చేసింది..! కనీవినీ ఎరగని పరిహారమంటూ మురిపించిన యాజమాన్యం, భూములన్నీ తీసుకున్నాక ముఖం చాటేసింది..! నిత్య బ్లాస్టింగ్లతో పొమ్మనలేక పొగబెడుతూ రాక్షసానందం పొందుతోంది..!
(కోల్‌బెల్ట్ ప్రతినిధి):ఒకప్పుడు పచ్చని పంట పొలాలు, వాగులు, వంకలు, పశువుల అరుపులు, పక్షుల కిలకిలారావాలతో కళకళలాడిన ఆ గ్రామాలన్నీ నేడు బొందలగడ్డలుగా మిగిలాయి. భూ ఉపరితల (ఓపెన్‌కాస్టు) భూతం శరవేగంగా రాక్షస యంత్రాలతో బొగ్గును తరలించుకుపోయే పనిలో నిమగ్నం కావడంతో వాటి పదఘట్టనల కింద అమాయకుల బతుకులు సమిధలవుతున్నాయి. వ్యవసాయం వట్టిపోయి రైతులు, ఉపాధి కరువై వివిధ వృత్తిదారులు చెట్టుకొకరు పుట్టకొకరు పోగా ఊళ్లన్నీ శ్మశానాలను తలపిస్తున్నాయి.
ఇక పరిహారం అందక మిగిలిన వాళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి సంస్థ బెల్లంపల్లి రీజియన్‌లో అపార బొగ్గు నిక్షేపాలున్నాయి. వీటిని త్వరితగతిన తరలించే పనిలో భాగంగా సింగరేణి యాజమాన్యం, లాభసాటిగా ఉండే భూఉపరితల (ఓపెన్‌కాస్టు) బొగ్గు గనులను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే బెల్లంపల్లి రీజియన్ పరిధిలో గడిచిన రెండు దశాబ్దాలుగా పర్యావరణ, జీవన విధ్వం సం సృష్టిస్తోంది. ఇప్పటికే 26 గ్రామాల నుంచి వేల ఎకరాలకు పైగా భూములను స్వాధీనం చేసుకున్న సం స్థ, మళ్లీ వేల ఎకరాలను కబలించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే అనధికారికంగా వందలాది గ్రామాలను మాయం చేస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. నిర్వాసితులకు మాత్రం నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర అన్యాయం చేస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. గ్రామాలు ఖాళీ చేసేటప్పుడు, అధికారులు నిర్వాసితు ల కుటుంబాలకు లెక్కలేనన్ని హామీలిచ్చి, తీరా భూ ములు తీసుకున్నాక వాటిని తుంగలో తొక్కుతోంది. 18 ఏళ్లు నిండిన యువకులందరికీ ఉపాధి కల్పించకుండా, స్థానికులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలియకుండా మోసం చేస్తోంది. తూతూమంవూతంగా పునరావాసం కల్పించి కనీస సౌకర్యాలకూ దిక్కులేకుండా చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment