Tuesday, 11 December 2012

తెలంగాణ S.I ఉద్యోగాలకి ఎసరు.


రాష్ట్ర స్థాయి పోస్టుగా మార్చడం వెనుక..
తెలంగాణ ఉద్యోగార్థుల నోట్లో మట్టి?
ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనే!
ఒకేసారి పదోన్నతులూ సాధ్యంకావు!
హోం మంత్రిపై తెలంగాణవాదుల ధ్వజం
 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కల్పించడం వెనుక సీమాంధ్ర సర్కారు కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వెల్లు ఇప్పటిదాకా జోనల్ స్థాయి ఉద్యోగంగా ఉన్న ఎస్‌ఐ పోస్టును ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోస్టుగా మార్చడం తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఆ పోస్టులు దక్కకుండా చేసే ప్రయత్నమేనని అటు శాఖలోనూ, ఇటు తెలంగాణ ఉద్యమక్షిశేణుల్లోనూ వినిపిస్తున్నది. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులు కల్పించిన రాజ్యాంగ రక్షణ ఈ నిర్ణయంతో పోతుందని పలువురు చెబుతున్నారు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనే అవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ మార్పు వలన ఏకకాలంలో పదోన్నతులకూ ఇబ్బందులు ఎదురవుతాయని శాఖలోని పలువురు సీనియర్ అధికారులు అభివూపాయపడుతున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయాలు జరుగుతున్న సమయాన మరోసారి కీలకమైన సబ్ ఇన్‌స్పెక్టర్ల ఉద్యోగాల విషయంలో ఈ ప్రాంతం పొట్టగొ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రాంత ప్రతినిధి అయిన హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి ఏం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. సత్వరమే ఈ నిర్ణయాన్ని పునరాలోచించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గతంలో కానిస్టేబుళ్ల అంశం చిచ్చులా రగులుకుని.. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తాడోపేడో తేల్చుకునే ఉద్యమానికి దారితీసిందని గుర్తు చేస్తున్న తెలంగాణవాదులు.. ఎస్‌ఐ పోస్టు వ్యవహారం కూడా అదే స్థాయిలో ఉద్యమాలకు పురికొల్పుతుందని స్పష్టం చేస్తున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్లకు గెజిటెడ్ హోదా కల్పించడంపై ఆనందం వ్యక్తమవుతున్నా.. దానిని రాష్ట్రస్థాయి పోస్టుగా మార్చటంపైనే తెలంగాణ ప్రాంతంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టులు జోనల్ స్థాయి ఉద్యోగాలు. సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లకు జోనల్ స్థాయిలోనే పదోన్నతులు ఇస్తారు. డీఎస్‌పీ పోస్టు రాష్ట్ర స్థాయి పోస్టు కాబట్టి ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్‌పీగా పదోన్నతులు ఇచ్చినపుడు ఆయా జోన్లలోని ఖాళీలనుబట్టి వాటిని భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు ఇదే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టును రాష్ట్ర స్థాయి పోస్టుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల జోనల్ స్థాయిలో వారికి ప్రమోషన్లు ఇవ్వటానికి కుదరదని పలువురు సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఓ సంవత్సరం బ్యాచ్‌లో రెండు వందల మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉండి, వారందరికీ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వాలంటే రెండు వందల ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీ ఉండాలని వారు అన్నారు. ఈ సంఖ్యలో ఒకేసారి ఖాళీలు ఏర్పడటం అసాధ్యమని చెప్పారు. కనుక ఒక బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వటం ఎంతమాత్రం సాధ్యం కాదని తేల్చారు.

పదోన్నతుల్లో అన్యాయం!
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పదోన్నతుల్లో కూడా అన్యాయం జరుగుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జోన్‌లో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు ఉండటం, ఇక్కడ మిగిలిన ఐదు జిల్లాల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోస్టులను సబ్ ఇన్‌స్పెక్టర్ నుంచి ఇన్‌స్పెక్టర్‌గా అప్‌క్షిగేడ్ చేయటం వల్ల ఈ జోన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ నుంచి ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్ స్థాయిలోనే పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో పనిచేసే అధికారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటూ వచ్చిందన్నారు. ఇది వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారికి రాష్ట్రపతి ఉత్తర్వులు కల్పించిన రాజ్యాంగ రక్షణ అని వివరించారు. ఇది ఒక్క పోలీసుశాఖలోనే లేదని.. రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి వచ్చే అన్ని శాఖల్లో ఉంటూ వచ్చిందని తెలిపారు. న్యాయస్థానాలు కూడా సీనియారిటీకి సంబంధించిన పలు వ్యాజ్యాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను వెనుకబడిన ప్రాంతాల వారికి కల్పించిన రాజ్యాంగ రక్షణగానే అభివర్ణించాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క పోలీసుశాఖలోనే ఇబ్బందులు వస్తున్నట్టు.. సబ్ ఇన్‌స్పెక్టర్లకు జోనల్ సీనియారిటీని రద్దు చేసి రాష్ట్రస్థాయి సీనియారిటీ కల్పించాలని హోంశాఖ నిర్ణయం తీసుకోవటం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ఆ ఉత్తర్వులు వెనుకబడిన ప్రాంతాల వారికి కల్పించిన రాజ్యాంగ రక్షణను కాలరాయటమే అవుతుందని వివరించారు.

రిక్రూట్‌మెంట్‌లో సైతం..
ఇక, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టును రాష్ట్రస్థాయి పోస్టు గా మార్చటం వెనక రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి దానికి మినహాయింపు వచ్చేలా చేసే కుట్ర ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణవాదులు చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టే అని పేర్కొన్నారు. ఇప్పటివరకు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి జోనల్ స్థాయిలోనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ అమల్లో ఉందని తెలిపారు. దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు ఐదో జోన్‌లో పోస్టుల కోసం ప్రయత్నించేవారన్నారు. ఇప్పుడు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టును రాష్ట్రస్థాయి పోస్టుగా మారిస్తే రిక్రూట్‌మెంట్ ప్రక్రియను కూడా రాష్ట్రస్థాయిలో చేయాల్సి ఉంటుందన్నారు. ఇటు ప్రభుత్వంలో...అటు పోలీసు యంత్రాంగంలో సీమాంవూధుల ఆధిపత్యమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరిపితే ఇక్కడివారికి సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు దక్కకుండా పోతాయన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ఇప్పటికే పోలీసుశాఖలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు 20% కూడా లేరని చెప్పారు. గతంలో ఎండీవో పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా మార్చారని.. ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో ఎండీవోలుగా సింహభాగం సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే వచ్చి చేరారని వివరించారు. సబ్ ఇన్‌స్పెక్టర్లకు గెజిటెడ్ హోదా ఇచ్చినా రిక్రూట్‌మెంట్లు, పదోన్నతుల్లో జోనల్ విధానాన్నే అమలు చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్వో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లకు కూడా గెజిటెడ్ హోదా కల్పించారని, అయితే వీరికి పదోన్నతులు కల్పించటంలో జోనల్ విధానాన్నే అమలు చేస్తున్నారని చెప్పారు. సబ్ ఇన్‌స్పెక్టర్ల విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు

హోంమంత్రి ఏం చేస్తున్నారు?
తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందితోపాటు సబ్ ఇన్‌స్పెక్టర్ కావాలనుకుంటున్న ఇక్కడి నిరుద్యోగులకు అన్యాయం జరిగేలా నిర్ణయాలు వస్తున్నా వాటిని హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి అడ్డుకోలేకపోవటంపై తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెంది ఉండి, ఇక్కడివారి ప్రయోజనాలను కాపాడలేకపోతే హోంమంత్రి పదవి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. సీమాంధ్ర సర్కార్.. పోలీసు శాఖలోని కీలక స్థానాల్లో ఉన్న సీమాంధ్ర అధికారులు ఒక వ్యూహం ప్రకారం ఇదంతా చేశారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందినవారికి అన్యాయం చేసే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment