Tuesday, 18 December 2012

ప్రతిఘటన తప్పదు : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు


ప్రతిఘటన తప్పదు : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ కార్యాలయంపై కొండా గూండాల దాడికి ప్రతిఘటన తప్పదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినయ్‌బాస్కర్, టీ. రాజయ్య హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సీపీ సీమాంధ్ర గూండాగిరి పోరాటాల గడ్డ తెలంగాణలో నడవదనే విషయం కొండా గూండాలు గ్రహిస్తే మంచిదన్నారు. కొండా దంపతులకు మతి భ్రమించినట్లుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. లేకుంటే ఇలాంటి పిచ్చి చేష్టలు చేయరని వారు తెలిపారు. ఇప్పటికైనా కొండా సురేఖ, మురళి ఈ భే ధమాక్ చేష్టలు మాని, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. లేకుంటే తెలంగాణ వాదుల ఆగ్రహజ్వాలల్లో మాడి మసైపోక తప్పదని హెచ్చరించారు.

No comments:

Post a Comment