Friday, 7 December 2012
మరో సారి తెలంగాణ ఫ్రజలను మోసం చెయనున్న సీమాంధ్ర పార్టీలు
మరో సారి తెలంగాణ ఫ్రజలను మోసం చెయనున్న సీమాంధ్ర పార్టీలు:
27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలు.. మరోవైపు డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాలు.. ఇంకోవైపు ఈ నెల 28న ఢిల్లీలో తెలంగాణపై జరగాల్సిన అఖిలపక్ష సమావేశం! మూడు కీలక ఘట్టాల నడుమ రాజకీయం మొత్తం అఖిలపక్ష సమావేశం కేంద్రంగా నడుస్తోంది. ఇదే ప్రాతిపదికగా కాంగ్రెస్లో తెలంగాణ వ్యతిరేక కుట్రలకు తెరలేస్తున్నది! తెలుగు మహాసభలు ఉన్నాయి కాబట్టి.. అఖిలపక్షాన్ని వాయిదా వేయాలంటారు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ! సీఎం కిరణ్ కూడా ఇదే అభివూపాయాన్ని వెలిబుచ్చుతారు! ఇదే అఖిలపక్షం సాకు చూపించి.. అసెంబ్లీ సమావేశాలను హుళక్కనిపించాలని ప్రయత్నిస్తారు! తెలంగాణపై అన్ని పార్టీలూ అభివూపాయాలు చెప్పాలి కానీ.. కాంగ్రెస్ వారు మాత్రం చెప్పరు! ఎందుకంటే ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. వారి చేతుల్లోనే ఉంది కాబట్టి!! ఇప్పటికే ఢిల్లీ పెద్దలు అఖిలపక్ష సమావేశాన్ని అవగాహన భేటీగా మార్చేసి.. ఏదేదో ఊహించుకునేంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు! అలాంటిదానికీ అవకాశం ఇవ్వకూడదని భావించే కొందరు సీమాంధ్ర పెద్దలు.. ఇద్దరేసి.. ముగ్గురేసి ప్రతినిధులు ఢిల్లీ వెళ్లాలని పాతపాట పాడుతుంటారు! మొత్తంగా తెలంగాణ విషయంలో కాంగ్రెస్లో కొత్త కుట్రలకు తెర లేస్తున్న పరిస్థితి కళ్లకట్టినట్లు కనిపిస్తోందని తెలంగాణ ఉద్యమ నాయకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ అంశాన్ని ఏ మేరకు అడ్డుకోవడం వీలైతే ఆ మేరకు అడ్డుకోవాలన్నదే ఉద్దేశంగా ఢిల్లీ నుంచి గల్లీదాకా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిగా కనిపిస్తోందని వారు మండిపడుతున్నారు. తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నా.. పోరాటాలు నానాటికీ ఉధృతమవుతున్నా.. తమ తీరు మాత్రం మారలేదని కాంగ్రెస్ నాయకత్వం మళ్లీ మళ్లీ రుజువు చేసుకుంటోందని తెలంగాణ శ్రేణులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలను సాకుగా చూపించి.. అఖిలపక్షాన్ని వెనక్కు నెట్టాలని ప్రయత్నించడం.. అదే అఖిలపక్ష సమావేశాన్ని సాకుగా చూపించి.. అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలనుకోవడం.. అఖిలపక్షంలోనూ కాంగ్రెస్ అభివూపాయం చెప్పే ప్రసక్తి లేదని భీష్మించుకోవడం గమనిస్తే తెలంగాణను అడ్డుకోవాలనే పాతధోరణే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment